గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ.అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తరచు గంజాయి రవాణా, వినియోగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.