తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్ రామాలయం వద్ద గల ప్రభుత్వ బీసీ కాలేజ్ బాలికల హాస్టల్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్ నిర్వహణపై ఎన్ హెచ్ ఆర్ సి చైర్ పర్సన్ విజయ భారతి సయాని ఆదేశాల మేరకు జేసీ తనిఖీ నిర్వహించారు.బాలికలతో ఆయన మాట్లాడి అక్కడ అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. ఆర్డీవో బీఎస్ఎన్ రెడ్డి, తహశీల్దార్ సునీల్ కుమార్ ఉన్నారు.