పెంటపాడు: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన

85చూసినవారు
పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కరెంట్ బిల్లులు, కరెంట్ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం మండల కన్వీనర్ రంగారావు మాట్లాడుతూ. ఒకపక్క పనులు లేక నిత్యవసర వస్తువులు కరెంట్ ఛార్జీలు మోయలేని భారంగా ఉన్నాయన్నారు. అలాగే ప్రభుత్వాలు ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలన్నారు.

సంబంధిత పోస్ట్