పాలకోడేరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. అనంతరం ఆసుపత్రిక వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పలువురు ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.