నిడమర్రు మండలం భువనపల్లి వైసీపీ కార్యాలయంలో స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా గురువారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు జాతీయ జెండా ఎగరవేశారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.