పేదల కడుపు నింపడం మానసిక సంతోషాన్ని కలిగిస్తోంది: CM చంద్రబాబు

73చూసినవారు
పేదల కడుపు నింపడం మానసిక సంతోషాన్ని కలిగిస్తోంది: CM చంద్రబాబు
పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడం మానసిక సంతోషాన్ని కలిగిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. 'దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను పెడుతున్నాం. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ. డొక్కా సీతమ్మ ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ. అరకొర సంపాదనతో జీవించే వారికి అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్