అక్రమ అరెస్ట్‌లపై మాజీ మంత్రి రోజా ఫైర్

82చూసినవారు
AP: అక్రమ అరెస్ట్‌లపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. చిత్తూరు సబ్ ‌జైల్‌లో వైసీపీ నేతలను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. బెయిల్‌పై వచ్చేలోపు మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్