ఔరంగజేబును సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అబూ అజ్మీ ఇటీవల ప్రశంసించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాజాగా వీటిపై మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా స్పందిస్తూ.. మీరు అసెంబ్లీకి ఎన్నికైన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ పరిపాలించారు. ఔరంగజేబు శంభాజీ మహారాజ్‌ను ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఛావా సినిమా చూడాలన్నారు. ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని, అతడిని ప్రేమించే వారు తమ ఇళ్లలో సమాధిని నిర్మించుకోవాలని ఆమె పేర్కొన్నారు.