AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. "గతంలో ఎప్పుడో చెల్లింపు జరిగిపోయిన చేపల చెరువుల లీజు డబ్బులను మళ్లీ ఇవ్వాలంటూ టీడీపీ గూండాలు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటివద్ద ఘర్షణకు దిగారు. రాళ్ళు ఆయుధాలతో ఇంటిపై దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు” అని ట్వీట్ చేసింది.