బొప్పాయి పండు పేస్ట్‌ని రోజులో 5 నిమిషాల పాటు ముఖంపై మర్దనా చేయడం ద్వారా పిగ్మెంటేషన్‌ను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. బొప్పాయిలో E, K విటమిన్లు అధికంగా ఉంటాయి. దీనిని రోజు తిన్నా.. ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడేవారికి కూడా బొప్పాయి మంచి ఔషధం.