గంగా,యమునా ,సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమం అంటారని అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం సరస్వతి నది మనకీ ఎక్కడా కనిపించదు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఈ నదిని కనుగోనడానికి ఎన్నో పరిశీలనలు చేసి వేల ఏళ్ల క్రితం నది ఎండిపోయినట్లు తేల్చారు. కానీ పురాణాల ప్రకారం తమ తపస్సును అడ్డుకోవద్దని ఋషులు నదిని వేడుకున్నప్పటికీ ప్రవహించడంతో చివరికి ఋషులు శపించడంతో అది అదృశ్యమైనట్లు పండితులు చెబుతున్నారు.