తియ్యగా, నోటికి కమ్మగా, అమృతంలా అనిపించే చెరకు రసం ఇష్టపడని వారుండరు. రుచికే కాదు చెరకు రసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. కాలేయానికి వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా కామెర్ల వ్యాధి నుంచి కాపాడుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. చెరుకులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆకలి కలిగించదు. బరువు త్వరగా తగ్గవచ్చు.