AP: అర్హత ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం గతంలో తెలిపింది. అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ. 6 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి, మొత్తం రూ.20 వేలు ఇవ్వనుంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింప చేయనుంది.