ప్రతీ రోజు కేవలం 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకుంటే.. ఆరోగ్యానికి ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశం ఉంది. మోతాదుకు మించిన ఉప్పు శరీరంలోకి వెళ్లడం వల్ల గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతోందని హెచ్చరిస్తున్నారు.