గోధుమగడ్డి జ్యూస్‌తో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గోధుమగడ్డి జ్యూస్ రక్తంలో షుగర్‌ని తగ్గించడానికి దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెలసరి సమయాల్లో మహిళలకు అధిక రక్తస్రావం సమస్యను తగ్గించటానికి గోధుమగడ్డి జ్యూస్ ఉపశమనం కలిగిస్తుంది.