ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలామంది శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే చీమలు వచ్చిన దిశను బట్టి ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. బియ్యం పెట్టెలో నుండి వస్తే డబ్బు, బంగారం వద్ద కనిపిస్తే బంగారు వస్తువులు లభిస్తాయి. ఉత్తరం నుండి ఆనందం, దక్షిణం నుండి లాభాలు, తూర్పు నుండి చెడు వార్తలు, పశ్చిమం నుండి విదేశ యాత్ర సూచిస్తాయి. ఎర్ర చీమలు దురదృష్టం తెస్తాయి, సంపద నష్టాన్ని సూచిస్తాయి, కానీ గుడ్లతో బయటకు వెళితే మంచిది.