గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి: వెంకయ్యనాయుడు

62చూసినవారు
గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి: వెంకయ్యనాయుడు
గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారని.. వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలని వెంకయ్య అన్నారు. గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్