కోల్‌కతా హత్యాచార ఘటన.. తన కొడుకును ఉరి తీయాలన్న తల్లి!

83చూసినవారు
కోల్‌కతా హత్యాచార ఘటన.. తన కొడుకును ఉరి తీయాలన్న తల్లి!
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్‌ను కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితుడి తల్లి మాలతి (70) మాట్లాడుతూ.. తన కొడుకు చేసిన తప్పును మహిళగా క్షమించలేనని తెలిపారు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, బాధితురాలి తల్లి బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. అతడికి ఉరి శిక్ష విధించినా అభ్యంతరం లేదన్నారు. ఈ కేసుపై సుప్రీంకు వెళ్లే ఉద్దేశం కూడా లేదని సంజయ్ సోదరి తేల్చిచెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్