ఎడ్లపాడు: రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుంది: ఎమ్మెల్యే
ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో రూ. 2. 30లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల తొలి పండుగ సంక్రాంతి అని, అటువంటి పండుగ వేళ అన్నదాతల లోగిళ్లు కళకళలాడాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని అన్నారు.