జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కష్టతరమైన, నిర్జన ప్రదేశాల్లో తప్పిపోయిన వ్యక్తుల కోసం, అనుమానితులను గుర్తించడానికి ఈ డ్రోన్ కెమెరాలు చాలా బాగా ఉపయోగపడతాయని సోమవారం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ప్రముఖుల పర్యటనల సమయంలో, వివిధ కార్యక్రమాలలో తక్కువ సిబ్బందితో ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేసి ఆయా ప్రదేశాలలో ఎటువంటి అసాంఘిక ఘటనలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.