గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలు వేణుగోపాల్ రెడ్డి, బాబు, శేషగిరిరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని తెలిపారు. వారి జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.