కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశంలో అత్యధికంగా ప్రజలు తినడానికి తిండి లేక, చేయటానికి పనిలేక అలమటిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ సీపీఐ 100వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాలాద్రి, మరియదాసు, అంజిబాబు, నూతలపాటి పాల్గొన్నారు.