తాడేపల్లిలో కొండచిలువ కలకలం
తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి గ్రామంలో కొద్ది రోజులుగా కొండచిలువ సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి గ్రామంలోని చిన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఓ అపార్ట్ మెంట్ వద్ద శుక్రవారం రాత్రి 10 అడుగుల కొండచిలువని గుర్తించిన స్థానికులు భయంతో చంపివేశారు.