గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామం ప్రధాన రహదారిపై సోమవారం గుంటూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరి వాహనాలు తనిఖీ చేశారు. వాహన చోదకులు లైసెన్స్ తో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. స్కూల్స్ బస్సు లో వాహనo పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిచరాదని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. 5 ద్విచక్ర వాహనదారులకు అపరాధ రుసుం విధించారు.