కొరిసపాడు: కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

66చూసినవారు
కొరిశపాడు మండలంలో రావినూతల, తిమ్మన్నపాలెం గ్రామాలలో సొసైటీల ద్వారా శనగలు, కందులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏవో శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. శనగలు మద్దతు ధర క్వింటాకు 5, 650 ఉండగా కందులకు 7, 550 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్