అద్దంకిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం

67చూసినవారు
అద్దంకిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం
అద్దంకి పట్టణం, బస్టాండ్ సెంటర్ నందు సోమవారం అద్దంకి సీఐ సుబ్బరాజు విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై, సూచనలు సలహాలు చేయడం జరిగింది. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని, వాహన చోదకులకు తెలిపారు. అలాగే రోడ్డుపై బండ్లు పెట్టి వ్యాపారాలు చేయరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై ఖాదర్ బాషా తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్