బాపట్ల: ఇతరులకు ఇబ్బందులు లేకుండా హోళీ జరుపుకోవాలి

74చూసినవారు
బాపట్ల: ఇతరులకు ఇబ్బందులు లేకుండా హోళీ జరుపుకోవాలి
బాపట్ల జిల్లాలో రేపు హోళీ పండుగ పురస్కరించుకొని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగను జరుపుకోవాలని ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్