ఈనెల 16వ తేదీన సూర్యలంక ప్రాంతంలో బాపట్లకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి బాచు ఏసుబాబు హత్య కేసును బాపట్ల పోలీసులు చేదించారు. మృతుడు ఏసుబాబు వద్ద గుమస్తాగాపనిచేస్తున్న కోక్కిలిగడ్డ చంద్రశేఖర్ రూ.30లక్షలు వడ్డీ వ్యాపారం చేస్తున్న ఏసుబాబును అడ్డు తొలగిస్తే ఆ డబ్బులు తనకు వస్తాయని అత్యాశకు పోయి ఏసుబాబును హత్య చేసినట్లు బాపట్ల డిఎస్పి రామాంజనేయులు ఆదివారం రూరల్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు.