వయోజనులకు విద్యా బోధనతో అక్షరాస్యత శాతం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వయోజన విద్యపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం జేసీ చాంబర్లో జరిగింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఉల్లాస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ సంవత్సరంలో 15, 268 మంది నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.