బాపట్ల: చoదోలులో పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రం
బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే వేగేశననరేంద్ర వర్మ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఉమ్మడి గుంటూరు- కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, అవగాహనా కేంద్రాన్ని ప్రారంభించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన పట్టభద్రులందరికి ఈ కార్యక్రమంలో ఓటు నమోదు చేశారు. మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఆఫ్జాల్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి పాల్గొన్నారు.