చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

58చూసినవారు
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామానికి చెందిన చౌటుపల్లి ఆశీర్వాదం(55) పొగాకు బైళ్ళతో ట్రాక్టర్ పై డ్రైవర్ ప్రక్కన కూర్చొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ స్కూల్ కు చెందిన బస్సు వెనకనుంచి ట్రాక్టర్ ట్రక్ ని ఢీ కొట్టింది. ఘటనలో ఆశీర్వాదం ట్రాక్టర్ ఇంజన్ పై నుండి రోడ్డు మీద పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్