చిలకలూరిపేట: అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
చిలకలూరిపేట: అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
సంక్షోభంలో కూడా సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా పరిపాలన ఎలా సాగించాలో జగన్ ఇప్పుడైనా సీఎం చంద్రబాబును చూసిన నేర్చుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట గ్రామీణ మండలం కట్టుబడివారిపాలెం, గంగన్నపాలెంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రానున్న సంక్రాంతి నాటికి పల్లెలన్నీ కొత్త రోడ్లతో, పక్కా డ్రైన్లతో కొత్త కళతో దర్శనమిస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్