చిలకలూరిపేట 14వ వార్డు రహమత్ నగర్ మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రఫాని శనివారం రాత్రి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ క్రమశిక్షణను పెంపొందిస్తుందన్నారు. మానవత్వానికీ, త్యాగానికీ రంజాన్ పండగ ప్రతీక అని తెలిపారు.