ఆమోదగిరిపట్నంలోని ఎంపీయుపి పాఠశాలలో గేట్ల ఏర్పాటుకు వేటపాలెం పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు పత్తి వెంకట సుబ్బారావు 50 వేల రూపాయల విరాళం ప్రకటించారు. శనివారం జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. ఈ స్కూలును హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించినట్లు హెచ్. ఎం సుధాకర్ చెప్పారు.