గుంటూరు మిర్చి యార్డ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్లో స్థానిక హిజ్రాలు, బిహార్ కార్మికులకు మధ్య సోమవారం వివాదం నెలకొంది. బిహార్కు చెందిన వ్యక్తి రూ. 50వేల నగదు, 2 సవర్ల బంగారం చోరీ చేసినట్లు హిజ్రాలు ఆరోపిస్తుండగా, హిజ్రాలు అక్కడ ఉండేందుకు వీలులేదని తమపై హిజ్రాలు దాడి చేశారని బిహార్ కార్మికులు ఆరోపించారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఇరువర్గాలు చేరుకున్నాయి.