పదవికి మాత్రమే రాజీనామా చేశానని ప్రజల కోసం ఎప్పుడు అండగా ఉంటానని గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు భరోసా ఇచ్చారు. గుంటూరు లో శనివారం అయన మాట్లాడుతూ పీవీకేనాయుడు కూరగాయల మార్కెట్ పేరు, ప్లానింగ్ మార్చే యోచనలో కూటమి ఉందని అన్నారు. ప్లానింగ్ మార్చినా, అర్హులైన వారందరికీ దుకాణాలు కేటాయించకపోయినా పోరాటం చేసే వారిలో నేను ముందుంటానని మేయర్ ప్రకటించారు.