ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్ తో బాధపడుతున్న వ్యక్తికి గుంటూరు జీజీహెచ్ వైద్యులు అద్భుతమైన చికిత్సను అందించి పునర్జన్మను ఇచ్చారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వి శనివారం చికిత్స వివరాలను వెల్లడించారు. దాసరిపాలెం కు చెందిన మహ్మద్ మెడ భాగం ఎడమ వైపు నొప్పితో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్ లో చేరారని డాక్టర్ వై. కిరణ్ కుమార్ వైద్య బృందం ఫ్రెనిక్ ట్యూమర్కు ఆపరేషన్ చేశారని చెప్పారు.