ఇంటర్ ప్రథమ, 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. గురువారంతో ఇంటర్ ప్రధమ సంవత్సరం, శనివారం 2వ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 29, 405 మందికిగాను, 28, 901 మంది హాజరవగా, 503మంది గైర్హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుండి జరగనుంది. ఇందుకోసం గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.