కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2వ తేదీ నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రజా రవాణా అధికారి రవికాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శైవ క్షేత్రాలైన సామర్లకోట, అమరావతికి బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. యాగంటి, మహానంది, శ్రీశైలంలను ఒకేరోజులో దర్శించుకోవడానికి ప్రతి శని, ఆదివారం రాత్రి బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.