రాజకీయ విమర్శలు చేస్తే అర్థరాత్రులు అరెస్ట్ చేస్తారా అని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వైసీపీ నేత కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్ట్ ను ఖండిస్తూ గురువారం వైసీపీ శ్రేణులు అడిషనల్ ఎస్పీ రమణ మూర్తిని కలిశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లే సీమరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.