గుంటూరు-విజయవాడ వైపు లారీలకు అనుమతి లేదు: ఎస్పీ

74చూసినవారు
గుంటూరు-విజయవాడ వైపు లారీలకు అనుమతి లేదు: ఎస్పీ
విజయవాడలో దేవి శరన్నవరాత్రులు సందర్భంగా గుంటూరు నుంచి విజయవాడ వైపు చిన్న, పెద్ద లారీలకు అనుమతి లేదని ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే అన్ని రకాల లారీలు పేరేచర్ల జంక్షన్ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్ వెళ్లాలని తెలిపారు. నేటి నుంచి దసరా దేవి శరన్నవరాత్రులు ముగిసే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్