రేపు పాఠశాలలకు రెండవ శనివారం సెలవుల్లేవు: శైలజ

77చూసినవారు
రేపు పాఠశాలలకు రెండవ శనివారం సెలవుల్లేవు: శైలజ
గుంటూరు జిల్లాలో రేపు రెండవ శనివారం అయినా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు పనిదినాలు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి శైలజ శుక్రవారం వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు సమాచారం అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్