విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా హోటళ్లు అండ్ అలైడ్ ఇనిస్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు నియోజకవర్గ హోటల్స్ యజమానులు గురువారం 7 వేల బ్రెడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి బెడ్లు తీసుకెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హాజరై ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతం అని కొనియాడారు.