గుంటూరు మార్కెట్ యార్డ్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. నెల రోజులుగా మార్కెట్ యార్డ్ లో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. విచారణ వేగవంతం అవుతున్న కొద్ది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.