గుంటూరు: కోర్టును మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు

67చూసినవారు
గుంటూరు: కోర్టును మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు
కోర్టును మోసగించిన వ్యక్తిపై నగరంపాలెం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. తుళ్లూరులో నమోదైన ఓ కేసులో వాయిదాకు వెంకటేశ్వర్లు శనివారం గుంటూరులోని కోర్టుకు హాజరు కావాలి. అతనికి బదులుగా సునీల్ అనే వ్యక్తి హాజరయ్యాడు. తానే వెంకటేశ్వర్లు అని చెప్పి కోర్టును మోసగించే ప్రయత్నం చేశాడు. అధికారులు రికార్డుల్లో వెంకటేశ్వరరావు ఫోటోతో సరిచూసి సునీల్ మోసపు చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్