గుంటూరు లోని పట్టాభిపురం మెయిన్ రోడ్డు పెట్రోల్ బంకు వద్ద శనివారం ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవీ, జోన్ 5 ఇన్ ఛార్జ్ రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు నమోదుకు నవంబర్ 6వ తేదీ వరకు గడువు ఉందన్నారు.