తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా గురజాల కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే రూ. 5 లక్షల ప్రమాద బీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం సాయం చేకూరుతుందన్నారు. సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలన్నారు.