రాష్ట్రంలో వైద్య ఖర్చులు భరించలేక ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకుంటున్నాడని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం కారంపూడి మండల కేంద్రంలో నియోజకవర్గం పరిధిలోని 21 మంది లబ్ధిదారులకు గాను రూ. 22, 44, 589 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జూలకంటి అందజేశారు.