మాచర్ల: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

67చూసినవారు
మాచర్ల: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
చదువు విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి బుధవారం మాచర్ల లోని కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మాచర్లకు చెందిన వినయ్‌కుమార్‌ (23) నైటింగేల్‌ నర్సింగ్‌ కాలేజీలో చదువుతున్నా ఇతను  జమ్మలమడక రహదారిలోని బొంబాయి కంపెనీ కాలువ వద్ద కట్టపై చరవాణి, చెప్పులు, గడియారం పెట్టి కాలువలో దూకాడు.  గురువారం వినయ్‌కుమార్‌ మృతదేహం బుగ్గవాగు వద్ద స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్