ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసి మానవత్వం చూపిన సంఘటన శుక్రవారం రాత్రి రాజుపాలెం మండల పరిధిలోని రెడ్డిగూడెం వద్ద జరిగింది. వివరాల్లోకి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అశోక్ కుమార్ విజయవాడ నుంచి పిడుగురాళ్ల వస్తున్నాడు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. గాయపడిన వ్యక్తికి చికిత్స చేసి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.